ఆదర్శ,కేజీబీవీ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

byసూర్య | Fri, Oct 18, 2024, 02:44 PM

పెండింగ్ డి. ఏ లు చెల్లించి, కేజీబీవీ ఉపాధ్యాయులు మినిమం టైం స్కేల్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదులో భాగంగా జగదేవపూర్ మండలంలోని బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాల, తదితర పాఠశాలను సందర్శించి, ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరిని వినడాలని, రావలసిన ఐదు పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని, 2018 నుండి అమలు చేయాల్సిన పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని , రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఉపాధ్యాయ, ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మంజూరు అయిన స్కావెంజర్ నిధుల్ని వెంటనే సంబంధిత పాఠశాలల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు నష్టం చేకూర్చే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు వెంటనే చేకూర్చాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత  పాఠశాలల్లో పని చేసే ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు.
ప్రైమరీ పాఠశాల పదివేల ప్రధానోపాధ్యాయుల పోస్టులను వెంటనే మంజూరు చేస్తూ, ఎస్జిటి ఉపాధ్యాయులకు అందరికీ ఎల్ఎఫ్ఎల్  ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు లేకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ  తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే  ఉపాధ్యాయులకు ఉచిత వైద్య పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన లక్షలాది రూపాయల పెండింగ్  బిల్లుల్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. సంవత్సర కాలం నుండి జిపిఎఫ్ లోన్స్ , మెడికల్ బిల్స్, గ్రాడ్యుటి పెన్షన్  సంబంధించిన డబ్బులు అన్నిటి కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు రిటైర్ కాగానే రావాల్సిన సౌలాభ్యాలు అన్నీ వెంటనే చెల్లించాలని, మూడు సంవత్సరాల బాండ్ లేదా ఆలస్యంగా డబ్బులు  రిలీజ్ చేయడం మూలంగా తీవ్రంగా నష్టపోతున్నారని,  కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సత్తయ్య, పోచయ్య, జిల్లా నాయకులు నేతి.శంకర్, తులసిదాస్,  సోమాచారి, శ్రీధర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.2 లక్షలు ఇస్తున్నామన్న సీతక్క Fri, Oct 18, 2024, 04:44 PM
అనివార్య కారణాల వల్ల కేటీఆర్ హాజరు కాలేకపోయారన్న న్యాయవాది Fri, Oct 18, 2024, 04:42 PM
రేపు ఉదయం తొమ్మిది గంటలకు మూసీ పరీవాహక ప్రాంతం వద్దకు వెళ్దామన్న హరీశ్ రావు Fri, Oct 18, 2024, 04:41 PM
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని .. Fri, Oct 18, 2024, 04:32 PM
లక్ష్మి నగర్ కాలనీ, కల్వర్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Fri, Oct 18, 2024, 04:30 PM