ఫోక్సో కేసులలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలి

byసూర్య | Wed, Oct 16, 2024, 10:32 PM

మెట్ పల్లి సర్కిల్ పరిధిలో నమోదు అవుతున్న గ్రేవ్, ఫోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. మెట్ పల్లి సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బుక్, క్రైమ్ రికార్డ్, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్, అండర్ ఇన్వెస్టిగేషన్, ట్రయల్స్ కేసులకు సంబంధించిన సిడి ఫైల్స్ ను ఆయన పరిశీలించారు. ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని అధికారులకు సూచించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్ సక్రమమైన పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు.
సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐల ద్వారా చర్యలు చేపట్టాలని సీఐ నిరంజన్ రెడ్డికి సూచించారు. పోలీస్ స్టేషనులను తరచూ తనిఖీ చేయడంతో పాటు రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై, సామాజిక అంశాలపై, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఎస్పీ  మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వరరావు, డిసిఆర్ బి ఇన్స్ పెక్టర్  శ్రీనివాస్, సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM