ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం

byసూర్య | Wed, Oct 16, 2024, 10:27 PM

ఆత్మకూరు మండలం పెద్ద చెరువు వెనకాల గల ప్రభుత్వ భూమి 791 సర్వే నం. లో గల భూమిని  ఆక్రమించుకుంటున్నారని గ్రీవెన్స్ సెల్ లో కొందరు దరఖాస్తు చేసి ఉన్నారు.  ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు మండల అధికారులకు దీనిపై విచారణ చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు దీని ఆధారంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీమతి నాగ పద్మజ అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి.
అధికారి శ్రీ శ్రీనివాస రావు స్థల పరిశీలన చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని  ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ ద్వారా తగు చర్యకై తెలియజేస్తామని తెలిపారు. అలాగే ఎంపీడీవో ఆఫీస్ వెనకాల గల రోడ్డు నిర్మాణం గురించి చేసిన దరఖాస్తు ఆధారంగా అట్టి స్థల పరిశీలన చేసి ఉపాధి హామీలో ఫార్మేషన్ రోడ్డు ఎస్టిమేట్ వేయమని సంబంధిత ఈజిఎస్ అధికారులను ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మార్వో జగన్మోహన్ రెడ్డి గారు, ఏ పి ఓ రాజిరెడ్డి,ఈసీ శ్రీధర్, రాము టి ఏ లు సురేష్, శ్రీధర్, సుధాకర్, ఆత్మకూర్, గూడెపాడు కార్యదర్శులు పాల్గొన్నారు.


Latest News
 

తాడ్వాయి జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం Thu, Oct 24, 2024, 01:08 PM
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు Thu, Oct 24, 2024, 01:06 PM
దన్వాడ: సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నేతలు Thu, Oct 24, 2024, 01:04 PM
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు: జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే Thu, Oct 24, 2024, 01:01 PM
కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నా: జీవన్ రెడ్డి Thu, Oct 24, 2024, 12:58 PM