హోంగార్డ్ గోపాల్‌ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

byసూర్య | Tue, Oct 01, 2024, 02:09 PM

సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుప్రత్రిలో చికిత్స పొందుతున్న హోం గార్డ్ గోపాల్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో కలిసి పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ ఉన్నతాధికారి కూడా వచ్చి పరామర్శించలేదు. హోం గార్డ్‌లు అంటే అంత చులకనా? ఇప్పటి వరకు హోం గార్డ్ గోపాల్ కుటుంబం చికిత్సకి లక్ష రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదు.


ప్రభుత్వం నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.నాలుగు నెలల నుండి జీతం రాక, ఇటు వైద్య ఖర్చులు భరించలేక పోతున్నాం అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తలకు దెబ్బ తగిలి మాట పడిపోయింది. పూర్తిగా మాటలు రావడానికి నాలుగు నెలల పాటు స్పీచ్ థెరఫీ అందించాలని డాక్టర్లు చెప్తున్నారు.ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్ళు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురి అయ్యారు.ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్‌ని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.


Latest News
 

కూల్చేసిన ఇంట్లో చిన్నారులు.. కన్నీళ్లు పెట్టించే వీడియో.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ Tue, Oct 01, 2024, 11:07 PM
తండ్రీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! వాట్ ఏ మూమెంట్ Tue, Oct 01, 2024, 10:56 PM
దసరాకు 6 వేల ప్రత్యేక బ‌స్సులు, హైదరాబాద్ శివారు నుం Tue, Oct 01, 2024, 10:55 PM
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తేనే, లేదంటే అది ఆప్షనల్ Tue, Oct 01, 2024, 10:53 PM
తెలంగాణలో వైన్సులు, మాంసం దుకాణాలు బంద్.. పెత్తరమాస వేళ పెద్ద సమస్యే వచ్చిందిగా Tue, Oct 01, 2024, 10:46 PM