దసరాకు 6 వేల ప్రత్యేక బ‌స్సులు, హైదరాబాద్ శివారు నుం

byసూర్య | Tue, Oct 01, 2024, 10:55 PM

దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సమయాభావం తగ్గించేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నిర్ణయం తీసుకుంది. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది.


దసరా పండుగకు ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతేడాదితో పోల్చితే ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందన్నారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు.


బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేది వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించారు.


దసరాను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 9, 10, 11 తేదిల్లో మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెబీ, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించుకోవాలన్నారు.


పోలీస్, రవాణా, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ టీజీఎస్ఆర్టీసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను సంస్థ అధికారిక వెబ్‌సైట్ tgsrtbus.inలో చేసుకోవాలని సూచించారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం తమ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలన్నారు.


Latest News
 

కూల్చేసిన ఇంట్లో చిన్నారులు.. కన్నీళ్లు పెట్టించే వీడియో.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ Tue, Oct 01, 2024, 11:07 PM
తండ్రీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! వాట్ ఏ మూమెంట్ Tue, Oct 01, 2024, 10:56 PM
దసరాకు 6 వేల ప్రత్యేక బ‌స్సులు, హైదరాబాద్ శివారు నుం Tue, Oct 01, 2024, 10:55 PM
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తేనే, లేదంటే అది ఆప్షనల్ Tue, Oct 01, 2024, 10:53 PM
తెలంగాణలో వైన్సులు, మాంసం దుకాణాలు బంద్.. పెత్తరమాస వేళ పెద్ద సమస్యే వచ్చిందిగా Tue, Oct 01, 2024, 10:46 PM