మంగుళరం.. మా ఊరి ఎల్లమ్మ జాతర

byసూర్య | Tue, Oct 01, 2024, 01:16 PM

గ్రామ దేవతలకు బోనాలు అంటే మన తెలంగాణ లో ఆషాడ మాసం మొత్తం జోరుగా సాగుతాయి. ఆ ఒక్క నెల రోజులు మాత్రమే వేలాది భక్తులతో ఆలయాలు కీటకీటలాడుతాయ్.. మనం ఇప్పుడు చెప్పుకొనే గ్రామ దేవత పేరు వెల్లుల్ల ఎల్లమ్మ తల్లి.. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి కుతవేటు దూరం లో ఉండే ఎల్లమ్మ తల్లికి అమితామైన శక్తులు ఉన్నాయానే భక్తుల ప్రగాఢ విశ్వాసం.
చరిత్ర..విశిష్టత..?
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామ దేవతలకు చిన్న లేదా పెద్ద ఆలయాలు నిర్మించి ఉంటాయి. కానీ మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామాంలో ఊరి పొలిమేరలో రోడ్డు అనుకోని ఎల్లమ్మ తల్లి 300 సంవత్సరాల క్రితం చెట్టు కింద వెలసిందని గ్రామస్తులు తెలిపారు. ఇక్కడ ఉండే అమ్మవారి విగ్రహం చెట్టు క్రింద పడుకొని విభిన్నంగా ఉంటుంది.చాల మంది గుడి కట్టించాలని అనుకున్నప్పటికి అమ్మ వారికి చెట్టు కిందే ఉండడం ఇష్టం వల్ల కట్టించలేకపోవడానికి గల కారణాన్ని వెళ్ళిబుచుతున్నారు. ఈ చెట్టు కు సమీప దూరంలో పంట పొలాల్లో వ్యవసాయ బావి ఉండేది, ఆ బావిలో భక్తులు స్నానం ఆచరిస్తే చర్మ వ్యాదులు దూరమవుతుండెవని భక్తులు తెలుపుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసిన చాలా వ్యాధులు సైతం ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే నయం అవుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.. ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలు అయినటువంటి నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు దర్శించుకొంటారు. అదేవిధంగా వచ్చే భక్తులు ఎండు చెప్పాలతో చేసిన బోనంతో కోళ్లు, మేకలను మరియు కల్లు సాకలతో మొక్కులు సమర్పిస్తున్నారు. అనంతరం కుటుంబాలతో సామూహికంగా భోజనాలు చేస్తారు.
వారం వారం చిన్న, చితక విధి వ్యాపారులకు ఉపాధి..
వేలాది భక్తులకు మొక్కు సంబందించిన కోళ్లు, ఎండు చాపలు, మసాలాలు, కూల్ డ్రింక్,  కిరాణ వస్తువులు అమ్ముకునే విధి వ్యాపారులు వందలాది మంది ఇక్కడ చిన్న, చితక వ్యాపారలు నిర్వహిస్తూ ఉపాధి పండుతున్నారు. చిన్న పిల్లలు ఆడుకొనే ఆట వస్తువుల అమ్మకపు దారులు సైతం ఉపాధి పొందుతూన్నారు. ఎల్లమ్మ పరిసరా ప్రాంతాంలోనే కాకుండా మెట్ పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డు పాత బస్టాండ్ ప్రాంతంలో సైతం ప్రతి మంగళవారం విధి వ్యాపారాలు కొనసాగుతాయి.
నాటి నుండి నేటి వరకు ఆలయ కమీటిల ఆధ్వర్యంలో అభివృద్ధినిర్వహణ
వెల్లుల్ల గ్రామాభివృద్ధి నుండి నియమింపబడ్డ ఆలయ కమిటీలు నాటి నుండి నేటి వరకు భక్తులకు సౌకర్యాలను కలిపిస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం పదుల సంఖ్యలో షేడ్లను నిర్మించారు. అంతేకాకుండ ఎల్లమ్మ వనం ను ఏర్పాటు చేయడంతో భక్తులకు సౌకర్యాలను పెంచారు.  త్రాగడానికి వాటర్ ట్యాంక్లను నిర్మించారు. ప్రతి మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
రవాణ సౌకర్యాలు..
మెట్ పల్లి పాత బస్టాండ్ నుండి పదుల సంఖ్యలో ప్రయివేట్ షేర్ ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండ ప్రయివేట్ వాహనాల్లో వస్తూ ఉంటారు. వాహనాల నిలుపుదలకు పార్కింగ్ స్థాలాన్ని ఆలయ కమీటి వారు ఏర్పరచినప్పటికి స్థలం సరిపోక భక్తులు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపుతారు.


Latest News
 

సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తా: మైనంపల్లి Tue, Oct 01, 2024, 07:01 PM
డీజే, ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం.. సీపీ ఉత్తర్వులు, ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష Tue, Oct 01, 2024, 06:56 PM
దొంగతనాలు జరగకుండా ఉండేందుకు,,,,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి Tue, Oct 01, 2024, 06:50 PM
అబ్దుల్ కలాం కూడా తిరుమలలో ఆ పని చేశారు.. లడ్డూ వివాదంపై బీజేపీ ఎంపీ Tue, Oct 01, 2024, 06:43 PM
కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్న మరాట్వాడ గులాబీ నేతలు,,,,ఎన్సీపీలో విలీనం వార్తలు Tue, Oct 01, 2024, 06:39 PM