పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

byసూర్య | Thu, Sep 26, 2024, 03:43 PM

జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ పాఠశాలను బుధవారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి తో కలిసి పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలోని పలు సమస్యలను పరిశీలించి పనులు ప్రారంభించారు.
విద్యార్థులకు, త్రాగునీటి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్, చైర్ పర్సన్ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి, బండ శంకర్, కౌన్సిలర్ దుర్గయ్య, మాజీ కౌన్సిలర్స్ పులి రాము, ఎలిగేటి నరసయ్య, జిల్లా యూత్ నాయకులు గుండ మధు, మైనారిటీ కమిటీ సదర్ భారీ భాయ్, గంగాధర్, సతీశ్, నరేశ్, అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM
వాళ్లందరికీ న్యాయం చేశాకే మూసీ ప్రాజెక్టుపై ముందుకెళ్తాం.. దాన కిషోర్ వివరణ Sat, Sep 28, 2024, 08:51 PM
దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్.. 12 లక్షల ఔషధ మొక్కలు నరికేస్తారా..? Sat, Sep 28, 2024, 08:50 PM
హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్.. అదనంగా 5 వేల మందికి ఉద్యోగాలు Sat, Sep 28, 2024, 08:47 PM
ఎదురెదురుగా ఢీకొన్న ఒకే కాలేజీ బస్సులు.. నర్సాపూర్‌లో విషాదం Sat, Sep 28, 2024, 08:46 PM