యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సాధన పై అవగాహన

byసూర్య | Wed, Sep 25, 2024, 02:04 PM

రాయపోల్ మండల పరిధిలోని ఎల్కల్ గ్రామంలో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్ ఆధ్వర్యంలో పదవ తరగతితో ప్రభుత్వ ఉద్యోగoపై అనే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ కె లతీఫ్    హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో యువత మంచి ఆలోచనలతో మంచి అలవాటులతోని ఉండాలని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధచూపాలని, పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్ చైర్మన్ నీల చంద్రం( రిటైర్డ్ ఆర్మీ) నిర్వహిస్తున్న పదవ తరగతి పాసుతో ప్రభుత్వ ఉద్యోగం అనే అవగాహన సదస్సుతో గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత అవగాహన పెంచుకొని డిఫెన్స్ రంగంలో రాణించి, వారి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత మద్యం, గంజాయి, ప్రేమ పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని  కోరారు.
ఎందుకంటే రేపటి ఈ దేశ భవిష్యత్తు మీరే కాబట్టి మీరు ఉన్నత విలువలతో తాము ఎంచుకున్న రంగాలలో రాణించి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు ఈ దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన అగ్నిపత్ స్కీం ముఖ్య ఉద్దేశం దేశంలో వీలైనంత ఎక్కువ మంది యువతకి ఆర్మీ ట్రైనింగ్ అందించడమే  దాని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇంకా డిఫెన్స్ రంగమైన అర్థ సైనిక బలగాలు, సివిల్ పోలీస్ విభాగాలలో జాయిన్ కావడానికి యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు. బేగంపేట  ఏఎస్ఐ అమృత్ మాట్లాడుతూ ఎల్కల్ గ్రామంలో జరుగుతున్న పదవ తరగతి తో ప్రభుత్వ ఉద్యోగం అవగాహన సదస్సును ఉపయోగించుకొని డిఫెన్స్ రంగంలో జాయిన్ కావాలని కోరారు. ఆజాద్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ నీల చంద్రం రిటైర్డ్ ఆర్మీ మాట్లాడుతూ  ఈ ప్రాంతం నుండి వీలైనంత ఎక్కువ మందిని డిఫెన్స్ రంగంలోకి పంపాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ సదస్సునీ ఉపయోగించుకొని, అగ్నిపత్ స్కీమ్ గురించి  సమాజంలో ఇంకా విస్తృతంగా అవగాహన పెంచాకోవాలని గ్రామ ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ బీజేపీ ఎస్సి మోర్చా ఇంచార్జ్ మంకిడి స్వామి, తాజా మాజీ సర్పంచ్ శ్యామల కుమార్, గ్రామ బిజెపి అధ్యక్షులు  బాలమల్లు ముదిరాజ్, ప్రసాద్,యం. డీ.శ్యాఫీ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Latest News
 

28 వేల నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా ఫ్లయింగ్ స్క్వాడ్స్ Wed, Sep 25, 2024, 06:58 PM
ములుగు అడవిలో బీభత్సానికి కారణమిదే.. విధ్వంసానికి కారణాలను గుర్తించిన సైంటిస్టులు Wed, Sep 25, 2024, 06:54 PM
ఆర్డీవో వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మూసీనదిని పరిశీలించిన అధికారులు Wed, Sep 25, 2024, 06:17 PM
తెలంగాణలో ప్రజలను హైడ్రా హైరానాకు గురి చేస్తోందని మల్లారెడ్డి వ్యాఖ్య Wed, Sep 25, 2024, 06:07 PM
బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM