కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి :సిఐటియు

byసూర్య | Tue, Sep 24, 2024, 10:03 PM

నల్గొండ జిల్లాలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల పిలుపుతో పట్టణంలో సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసి లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.  తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ముందు కార్మిక వ్యతిరేక చట్టాల నాలుగు లేబర్ కోడ్ల పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టింది కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేసింది పార్లమెంట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా యజమాన్యాలకు కొమ్ము కాసింది గత నాలుగు సంవత్సరాలుగా ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని రెండుసార్లు దేశవ్యాప్త సమ్మెలు సమరసిల ఉద్యమాలు జరిపినప్పటికీ బిజెపి ప్రభుత్వం లెక్కచేయలేదు దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్లకు సంబంధించిన రూల్స్ రూపొందించబడ్డాయి కొన్ని రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నారు.
ఈ పూర్వ రంగంలో కార్మికుల హక్కులకు ఉరితాలుగా మారిన ఈ లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతాంగం వ్యతిరేకిస్తూ ఈరోజు బ్లాక్ డే గా పాటించాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ప్రభుత్వ తక్షణమే స్పందించి వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, ప్రతి కార్మికులకు ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నన్నూరు వెంకటరమణారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మన్నెం బిక్షం సిఐటియు నాయకులు మంత్రాల మంగమ్మ ఆకటి లింగయ్య భీంరెడ్డి సీతారాం రెడ్డి సైదులు పోకల శశిధర్ దొంగరి వెంకన్న ఎండి లతీఫ్ రవి  తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM