పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్

byసూర్య | Sun, Sep 22, 2024, 07:10 PM

దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ  డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వివేకానంద ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి గర్ల్స్ కమిటీ వేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి  కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 వేల కోట్ల పైగా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందన్నారు.
స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకు టిసి,మెమో, కండక్ట్లు తీసుకునే సమయంలో కళాశాల యజమాన్యం నుండి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారని,అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దగ్గరికి వస్తున్న కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్య శాఖ మంత్రి లేకపోవడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యశాఖ మంత్రిని నియమించాలని,ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అట్టడుగు విద్యార్థులకు   రాష్ట్ర ప్రభుత్వం అండగానిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు  దేవరకొండ డివిజన్ అధ్యక్షులు రమావత్ లక్ష్మణ్ నాయక్, ఇద్దిరాములు,రాకేష్, చరణ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM