కదిలే బస్సులో వివాహితపై క్లీనర్ అత్యాచారం

byసూర్య | Sun, Sep 22, 2024, 07:03 PM

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వివాహితపై ఆ బస్సు క్లీనరే కీచకుడై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సెప్టెంబర్ 18వ తేదీన బుధవారం జరగ్గా.. ఈరోజు (సెప్టెంబర్ 22న) హైదరాబాద్ చౌటుప్పల్‌లో పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు, తన కుటుంబసభ్యులతో కలిసి ఫిర్యాదు చేయటంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.


ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోటకు చెందిన వివాహిత (28) హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో నివాసముంటూ.. నగరంలోనే ఉద్యోగం చేస్తోంది. అయితే.. ఈ నెల 18న తన స్వగ్రామమైన సామర్లకోటకు వెళ్లేందుకు.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకుంది. కాగా.. ఆ బస్సు కూకట్ పల్లిలో అదే రోజు రాత్రి బయలుదేరింది. అప్పటికే ఆ వివాహిత మీద కన్నేసిన క్లీనర్.. బస్సు చౌటుప్పల్ దాటే సమయంలో.. ఆ మహిళ కూర్చున్న సీటు దగ్గరికి వచ్చాడు.


బలవంతంగా బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దాడి సమయంలో బాధితురాలు కేకలు వేయగా.. క్లీనర్ ఆమెను బెదిరించాడు. అరిచినా.. ఈ విషయం ఎవరికైనా చెప్పినా చంపేస్తానని భయపెట్టాడు. దీంతో.. ఏమీ చేయలేక నిచ్చేష్టురాలైన ఆ బాధితురాలు.. ఆ కీచకుని పశువాంఛకు బలైపోయింది. మరుసటి రోజు సామర్లకోటలోని ఇంటికి చేరుకున్న బాధితురాలు.. భయంతో సైలెంట్‌గా మారింది. ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ఆరా తీయటంతో.. బస్సులో రాత్రి జరిగిన ఘటనను మొత్తం చెప్పింది.


దీంతో.. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను తీసుకొని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రయాణం చేసిన ట్రావెల్స్ బస్సు వివారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితున్ని గాలించే పనిలో పడ్డారు.


కాగా.. గతంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులుండగానే.. కదులుతున్న క్రమంలోనే.. వివాహితపై లైంగికదాడి చేసిన ఘటన వెలుగు చూసింది. అయితే.. ఆ ఘటనలో.. బాధితురాలు అరుస్తుందేమోనని ముందుగానే ఆమె నోట్లో గుడ్డలు కుక్కాడు నిందితుడు. మరి ఈ ఘటనలో.. బస్సులో ఎవరూ లేరా.. ఉన్నా ఆమె నోట్లో గుడ్డలు కుక్కటం లాంటి పనులు ఏమైనా చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Latest News
 

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM