పాతబస్తీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ మకాం,,,హైదరాబాద్ మరోసారి ఎన్ఐఏ సోదాలు

byసూర్య | Sun, Sep 22, 2024, 06:56 PM

హైదరాబాద్‌ పాతబస్తీలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. అయితే.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన రిజ్వాన్‌ అబ్దుల్‌ను.. ఆగస్టులో ఢిల్లీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. రిజ్వాన్‌ను విచారించగా.. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ పాతబస్తీలో మాకాం వేసినట్టు తెలసింది. పాతబస్తీలోని సైదాబాద్‌లోనే చాలా రోజులు తలదాచుకున్నట్టు విచారణలో తెలిసింది. దీంతో.. రిజ్వాన్‌ను వెంటబెట్టుకుని పాతబస్తీ చేరుకున్న ఎన్‌ఐఏ అధికారులు.. అతను ఉన్న గ్రీన్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు గంటపాటు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.


అయితే.. రిజ్వాన్ అబ్దుల్‌ ఐసిస్‌తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌. ఐసిస్‌ పూణే మాడ్యూల్‌లో భాగంగా రిజ్వాన్ అబ్దుల్ పనిచేస్తున్నట్టు సమాచారం. అయితే.. రిజ్వాన్‌ కదలికలపై ఫోకస్ పెట్టిన ఎన్ఐఏ.. ఢిల్లీలో పట్టుకుంది. అరెస్ట్ సమయంలో.. రిజ్వాన్ నుంచి.. 30 బోర్ పిస్టల్స్, 3 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు.. రిజ్వాన్‌ను పట్టించినవారికి.. 3 లక్షల రూపాయల నజరానా ఇవ్వనున్నట్టు గతంలో కేంద్ర హోం శాఖ ప్రకటించింది కూడా.


ఢిల్లీలో అరెస్ట్ అనంతరం రిజ్వాన్ ఎన్ఐఏ అధికారులు తమదైన శైలిలో విచారించగా.. తాను హైదరాబాద్ పాతబస్తీలో చాలా రోజుల పాటు తలదాచుకున్నట్టు తెలిపారు. సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో కొన్ని నెలల పాటు ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత.. రిజ్వాన్‌ను వెంటబెట్టుకుని మరీ ఆ అపార్ట్ మెంట్‌‍లో సోదాలు నిర్వహించారు. అయితే.. అపార్ట్ మెంట్‌లో ఏమేమి స్వాధీనం చేసుకున్నారన్నదానిపై మాత్రం ఇంకా సమాచారం లేదు.


మరోవైపు.. ఇదే విషయంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో టెర్రరిస్టులను ఎంఐఎం పెంచిపోషిస్తోందంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. దేశం మొత్తంలో ఎక్కడ టెర్రరిస్టులు దొరికిన.. వాళ్లలో ఎవరికో ఒకరికి పాతబస్తీతో లింక్ ఉంటుందని చెప్పుకొచ్చారు. పాతబస్తీని రోహింగ్యాలకు, టెర్రరిస్టులకు అడ్డాగా మార్చేస్తున్నారని ఆరోపించారు. ఓవైసీ కుటుంబం అనుమతితోనే.. టెర్రరిస్టులు పాతబస్తీలో తలదాచుకుంటున్నారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పాతబస్తీని ప్రక్షాళన చేసి న్యూసిటీగా మార్చేస్తామని బండి సంజయ్ తెలిపారు.


Latest News
 

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM