వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి

byసూర్య | Sun, Sep 22, 2024, 06:55 PM

వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ (2024-25) ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో సకల వసతులు కల్పించాలని, తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17. మించకుండా ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు. అవసరమైన గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2320,  కామన్ రకానికి రూ.2300 నిర్ణయించిదని వెల్లడించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 13 మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలో ఈ సీజన్లో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని వెల్లడించారు. ధాన్యాన్ని సేకరించేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 202,  ఐకేపీ ఆధ్వర్యంలో 44, వివిధ శాఖల ఆధ్వర్యంలో 12 కేంద్రాలు, మొత్తం 258 ప్రారంభించనున్నట్లు తెలిపారు. అవసరం అయితే ఇంకా కేంద్రాలు ఎక్కువ ప్రారంభిస్తామని పేర్కొన్నారు, అందుబాటులో పరికరాలు జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని అదనపు కలెక్టర్ వెల్లడించారు. టార్పాలిన్లు 7777, తూకం వేసే యంత్రాలు 766, ప్యాడీ క్లీనర్లు 634, తేమ శాతం చూసే మెషిన్లు 603 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమీక్షలో డీసీఎస్ఓ వసంత లక్ష్మి, జిల్లా మేనేజర్ రజిత, డీఏఓ అఫ్జల్ బేగం, డీసీఓ రామకృష్ణ, డీఎంఓ ప్రకాష్, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, డీటీఓ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM