గుంజపడుగు లో కార్టన్ అండ్ సెర్చ్ చేసిన పోలిసులు

byసూర్య | Sun, Sep 22, 2024, 10:52 AM

మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో  రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ ఆదేశానుసారం మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.రాజు మరియు మంథని ఎస్సై డి. రమేష్, రామగిరి ఎస్సై చంద్రకుమార్ ,మరియు ముత్తారం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో మంథని సర్కిల్లోని పోలీస్ సిబ్బందితో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది .గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగింది.అంతేకాకుండా సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు వేయడం జరిగింది. గ్రామంలోని యువత గంజాయి మరియు మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి చెప్పడం జరిగింది. గంజాయి మరియు మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని చెప్పడం జరిగింది. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పడం జరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి గొడవలలో తలదూర్చకూడదని సూచించారు.
అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. మీకు తెలియని ఏదైనా  ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన  వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని సూచించడం జరిగింది.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని చెప్పడం జరిగింది. గ్రామంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని చెప్పడం జరిగింది. మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించడం జరిగింది. మీకు ఎటువంటి సమాచారం తెలిసిన  తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని సూచించడం జరిగింది.


Latest News
 

ఏబీవీపీ మండలాల నూతన కమిటీ ఎన్నిక Sun, Sep 22, 2024, 01:05 PM
సంక్షేమ వసతిగృహాల పనితీరు మెరుగుపడాలి: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. Sun, Sep 22, 2024, 01:02 PM
సిడిపి పనుల స్థితిగతుల పై నివేదిక అందించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా Sun, Sep 22, 2024, 01:00 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి Sun, Sep 22, 2024, 12:57 PM
పెద్ద ఎక్లరా గ్రామం లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి Sun, Sep 22, 2024, 12:54 PM