ఏపీలో లిక్కర్ షాపుల టైమింగ్స్ ఇవే..

byసూర్య | Thu, Sep 19, 2024, 10:30 AM

నూతన మద్యం పాలసీకి ఏపీ క్యాబినేట్ ఆమోదం తెలిపిన క్రమంలో తక్కువ ధరకే మద్యం అందుబాటులోకి రానుంది.ఈ న్యూ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అందులో భాగంగా మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. అయితే తాజాగా మద్యం షాపుల పనివేళల విషయమంలో కూడా స్పష్టత ఇచ్చింది.రూ.99కే క్వాలిటీ మద్యం అందిస్తామని, అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇక లాటరీ పద్ధతిలో కొత్త మద్యం షాపులకు లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. కొత్త మద్యం షాపులకు దరఖాస్తు రుసుము రూ 2లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్ రిఫండబుల్. లైసెన్సులు దక్కిన వారికి షాపు రన్ చేసేందుకు 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. మద్యం షాపుల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా కల్లు గీత కులాలకు మద్యం షాపుల లైసెన్సుల్లో 10 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. లక్కీ డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు ఉంటుంది. ఓనర్‌కి 20% ప్రాఫిట్‌ లభిస్తుంది. జనాభాను బట్టి షాపుల సంఖ్య నిర్ణయించనున్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM