గుజరాత్‌లో తెలంగాణ మహిళా జవాన్ అనుమానాస్పద మృతి

byసూర్య | Sun, Sep 08, 2024, 07:18 PM

దేశ రక్షణ కోసం వెళ్లిన తెలంగాణ మహిళా జవాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బల్ల గంగా భవాని నాలుగేళ్ల కిందట.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్‌గా జాయిన్ అయ్యింది. విధుల్లో చేరినప్పటి నుంచి చురుక్కు ఉన్న గంగా భవాని.. దేశంలోని పలు ప్రాంతాల్లో తన సేవలు అందించింది. అయితే.. గతంలో ఉత్తర బెంగాల్‌లో విధులు నిర్వహించిన గంగా భవాని 8 నెలల క్రితమే గుజరాత్‌కు ట్రాన్స్‌పర్ అయ్యింది. ప్రస్తుతం గుజరాత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో జవాన్‌గా సేవలందిస్తోంది.


అయితే.. ఇటీవల జరిగిన రాఖీ పండుగకు సెలవుపై ఇంటికి వచ్చిన గంగా భవాని.. సెప్టెంబర్ ఒకటో తేదీన తిరిగి విధుల్లో చేరింది. శనివారం (సెప్టెంబర్ 7వ తేదీన) గుజరాత్ బోర్డర్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో.. విశ్రాంతి కోసం రాత్రిపూట గాంధీనగర్‌లోని గవర్నమెంట్ క్వార్టర్స్‌కు వచ్చింది గంగాభవాని. అయితే.. ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ.. క్వార్టర్స్‌లోనే ఉరేసుకొని గంగాభవాని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్నారు.


అయితే.. గంగాభవాని మృతి చెందినట్టుగా అధికారులకు ఆదివారం ఉదయం తెలియటంతో.. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే.. గంగా భవానీ మృతికి సరైన కారణాలేవి తెలియరాకపోవటంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే గానీ.. గంగాభవాని మృతికి అసలైన కారణాలు తెలుస్తాయని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.


గంగా భవాని మృతదేహాన్ని ఆదివారం (సెప్టెంబర్ 8)రోజున ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకువచ్చినట్లు సమాచారం. తన సొంత గ్రామంలోనే.. గంగాభవానీకి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. దేశానికి సేవ చేయాలని వెళ్లిన గంగాభవాని.. అనుకోని పరిస్థితుల్లో ఇలా అకాల మరణం చెందటం అటు కుటుంబసభ్యులనే కాదు.. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం మొత్తాన్ని తీవ్ర విషాదం కమ్మేసింది. తమ బిడ్డ దేశానికి సేవ చేసేందుకు వెళ్లిందని ఎంతో గర్వంగా చెప్పుకునే ఆ తల్లిదండ్రులు.. విగతజీవిగా మారిన గంగాభవానిని చూసి గుండెలవిసేలా రోధిస్తున్నారు. వారి రోధనలు చూసి.. స్థానికులు కూడా కంట నీరు పెట్టుకుంటున్నారు.



Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM