బావ ప్రాణం మీదకు తెచ్చిన బామ్మర్దుల పరాచకం

byసూర్య | Fri, Jul 26, 2024, 08:19 PM

బావాబామ్మర్దుల పరాచకం బావ ప్రాణం మీదకు తీసుకొచ్చింది. చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడేలా చేసింది. మెకానిక్‌ షెడ్డు ప్రైవేట్ పార్ట్‌లోకి ‌గాలి పంపింగ్‌ చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన యువకుడు (27) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతడి ట్రాక్టర్ రిపేర్ రావటంతో మెకానిక్‌ షెడ్డు వద్ద తీసుకెళ్లాడు. అక్కడ ట్రాక్టర్‌కు మరమ్మతు చేసుకుంటుండగా.. అతడి ఇద్దరు స్నేహితులు అక్కడికి వచ్చారు. ఆ ఇద్దరు యువకులు వరసకు బావబామ్మర్దులు అవుతారు. దీంతో కాసేపు వారు సదరు యువకుడిని ఆటపట్టించారు. అనంతరం హైడాల్రిక్‌ ఎయిర్‌ ప్రెషర్‌ను పెట్టి బలవంతంగా అతడి మలద్వారంలోకి గాలిని వదిలారు. ఈ ఘటనతో యువకుడు అస్వస్థకు గురయ్యాడు. తీవ్ర కడుపునొప్పితో అక్కడే కుప్పకూలిపోయాడు.


గమనించిన స్థానికులు వెంటనే మండల కేంద్రంలోనే ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి మెరుగుపడక పోటవంతో డాక్టర్ల వైద్యుల సూచన మేరకు మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం వరంగల్‌ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు పెద్దపేగులో గాలి చేరిందని.. సర్జరీ చేసి తొలగించారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు లక్షకు పైగానే ఖర్చు చేశారు. అయినా ఆ యువకుడి పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. విషమంగానే ఉన్నట్లు బంధువులు వెల్లడించారు. మరికొద్ది రోజులు హాస్పిటల్‌లోనే ఉండాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు.


ఇలా బావాబామ్మర్దుల మధ్య పరాచకం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది. అయితే ఇటువంటి ఘటనలో గతంలోనూ అనేకం జరిగాయి. సరదాగా చేసే కొన్ని పనులు ప్రాణాల మీదకు తెస్తాయి. సున్నితమైన అవయవ భాగాలపై కొట్టడం, ఇటువంటి పిచ్చి పనులు చేయటం వంటి వాటి వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM