తెలంగాణలో శాసనమండలి రద్దు ఖాయం.. మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్

byసూర్య | Fri, Jul 26, 2024, 07:49 PM

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ శాసనమండలి రద్దు కావటం ఖాయమంటూ.. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసనమండలి చెల్లుబాటు కాదని గోనె ప్రకాశ్‌రావు వ్యాఖ్యానించారు. కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప.. మండలి ఏర్పాటు చేయడం కుదరదని పేర్కొన్న ప్రకాష్ రావు.. ప్రస్తుతం తెలంగాణలో కేవలం 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్నారు. ఈ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని.. కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పారు. దీనిపై ఈరోజు (జులై 26న) ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రావు.. ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలపై కూడా ప్రకాష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల చేరికలు కాంగ్రెస్‌కు అప్రతిష్ఠ తెచ్చిపెడతాయన్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్తే.. చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అప్పుడు పార్టీ మారిన వారిపై అనర్హత వేటు పడుతుందని వివరించారు. రెండింట మూడో వంతు (2/3) ఎమ్మెల్యేలు ఉంటే తప్ప విలీనం సాధ్యం కాదని గోనె ప్రకాశ్ రావు వివరించారు.


గతంలో దశల వారీగా మిగతా పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రతిపక్షాలను చీల్చిన చరిత్ర కేసీఆర్‌ది అంటూ గోన్ ప్రకాష్ రావు మండిపడ్డారు. అసలు బీఆర్ఎస్ పుట్టుకే పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి18 వరకు, 2018 నుంచి 2023 వరకు శాసనసభ స్పీకర్లుగా పని చేసిన మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి అనైతికంగా వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM