నేను ఆ స్థానంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాన్ని: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

byసూర్య | Fri, Jul 26, 2024, 07:43 PM

తెలంగాణ బడ్జెట్‌పై కేసీఆర్ చేసిన విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర బడ్జెట్‌పై గగ్గోలు పెడుతున్న కేసీఆర్.. కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్‌ల కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఖండించారని గుర్తు చేశారు. మరి కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అడుగులు.. బీజేపీ వైపు పడుతున్నాయి కాబట్టే తెలంగాణకు అన్యాయం చేస్తున్నా కేసీఆర్ నోరు మెదపడం లేదని కోమటిరెడ్డి ఆరోపించారు.


ఏపీ, బీహార్‌లలో ఎన్డీయేకు మద్దతు ఇచ్చినందుకే ఆ రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. వారు మద్దతు ఉపసంహరించుకుంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని.. అప్పుడు రాహుల్ గాంధీనే ప్రధాని అవుతారని కీలక కామెంట్ చేశారు. ఆ భయంతోనే బీజేపీ ఆ 2 రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిపిందని వివరించారు. తాము నీతి అయోగ్ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నామని అసెంబ్లీలోనే తేల్చి చెప్పామని.. మరి కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు.


బడ్జెట్‌లో కేవలం వ్యవసాయ రంగానికే రూ.73 వేల కోట్లు కేటాయించామని.. అయినా బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 6 నెలల కోసమే తామ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని బడ్జెట్‌లో పెట్టిందని.. చెప్పిన పథకాలతో పాటు కొత్త వాటిని కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు.


మరోవైపు.. తాను కేసీఆర్ స్థానంలో ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడినంటూ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనం కోసం చర్చలు జరుపుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందంటూ కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. బీజేపీ కుర్చీ బచావో ప్రభుత్వం అన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు.. కాంగ్రెస్ సర్కార్ వడ్డీలు కడుతోందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీ కలిపి 42 వేల కోట్లు చెల్లించినట్టు మంత్రి తెలిపారు. రైతు కూలీలకు ఇచ్చిన ఎన్నికల హామీ అమలుకు సర్వం సిద్ధం అవుతుందని తెలిపారు.


తమది రైతు ప్రభుత్వం అనడానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 72,659 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడమే నిదర్శనమని.. అందులోనూ కేవలం రుణమాఫీకే రూ.31 వేల కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరిగిందన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM