మళ్లీ తగ్గిన బంగారం ధర

byసూర్య | Fri, Jul 26, 2024, 10:37 AM

ఆకాశమే హద్దుగా దూసుకుపోయినా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బంగారం ధరలు కనివినీ ఎరగని రీతిలో పతనమవుతున్నాయి.ఒకానొక సమయంలో రూ. 80 వేల మార్కును దాటేసిన తులం బంగారం ధర ప్రస్తుతం రూ. 70 వేలలోపు నమోదవుతోంది. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810కి చేరింది. దీంతో చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర రూ. 70వేల లోపు నమోదైంది. అయితే రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయంగా నిపుణులు భావిస్తున్నారు. మరి ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.


తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..


హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,990గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810 వద్ద కొనసాగుతోంది.


విజయవాడలో 10 గ్రాముల తులం బంగారం ధర రూ. 63,990కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810గా ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 69,810గా ఉంది.


వెండి ధరలు కూడా..దేశంలో వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై ఈరోజు కూడా రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు, ముంబయి, పుణెలో కిలో వెండి ధర రూ. 84,400 అలాగే హైదరాబాద్‌, చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 88,900 వద్ద కొనసాగుతోంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM