![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 01:16 PM
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని తొండుపల్లిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మొక్కలు నాటి ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం హయాంలో హరితహారంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రస్తుతం కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వారి బాధ్యతాయుతంగా పెంచాలని సూచించారు.