byసూర్య | Mon, Jul 08, 2024, 03:40 PM
పాలకుర్తి మండలం బసంతనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డా. వై ఎస్. రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.