byసూర్య | Mon, Jul 08, 2024, 03:41 PM
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద, సుల్తానాబాద్ లోని నెహ్రూ చౌరస్తా వద్ద సోమవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.