byసూర్య | Mon, Jul 08, 2024, 02:01 PM
ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఇందారపు రామన్న, మాజీ ఏఎంసీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్ పాల్గొన్నారు.