హైకోర్టును ఆశ్రయించిన గులాబీ బాస్ కేసీఆర్.. ఆ కేసులో తన ప్రమేయం లేదంటూ

byసూర్య | Mon, Jun 24, 2024, 09:16 PM

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసు విషయంలో తన ప్రమేయం ఏమీ లేదంటూ సోమవారం రోజున ఉన్నత న్యాయస్థానంలో కేసీఆర్ పిటిషన్ వేశారు. 2011లో జరిగిన రైలు రోకో సందర్భంగా పోలీసులు తనపై పెట్టిన కేసు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఉండగా.. దాన్ని కొట్టేయాలంటూ పిటిషన్‌లో కేసీఆర్ కోరారు.


తెలంగాణ ఉద్యమంలో భాగంగా.. రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారంటూ పోలీసులు ప్రజాప్రతినిధుల కోర్టుకు నివేదిక అందజేశారు. 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో రైల్ రోకోకు కేసీఆర్.. పిలుపునిచ్చారంటూ నివేదికలో పోలీసులు తెలిపారు. రైలు రోకో వల్ల రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగుల విధులకు తీవ్ర ఆటంకం కలిగిందని.. పోలీసులు వివరించారు.


అయితే.. ఈ పిటిషన్‌పై స్పందించిన కేసీఆర్.. తాను ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేసీఆర్ వివరించారు. ఆ కేసులో ఎలాంటి బలం లేదని.. దాన్ని కొట్టేయాలంటూ ఉన్నత న్యాయస్థానానికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.


Latest News
 

పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM