byసూర్య | Sat, Jun 22, 2024, 01:34 PM
బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సతీష్ గౌడ్ అధికారులను కోరారు. శనివారం దేవరకొండలో ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా ప్రవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టై బెల్ట్ లు అమ్ముతూ పేద విద్యార్థులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జీవో నెంబర్ ఒకటి ప్రకారం అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.