byసూర్య | Thu, Jun 20, 2024, 02:25 PM
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల కట్టడిపై ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు విఫలం చెందారని ఎబివిపి జిల్లా కన్వీనర్ నరేష్ అన్నారు. గురువారం నారాయణపేట పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యారంగం పై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని అన్నారు. ఫీజుల దోపిడీ కట్టడి చేయాలని పక్షంలో ఆందోళనలు చేస్తామని అన్నారు.