byసూర్య | Thu, Jun 20, 2024, 02:23 PM
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వైద్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అలజెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కిరణ్ కుమార్, ఏఎన్ఎం గోవిందమ్మ, జెడ్పిహెచ్ ఎస్ హై స్కూల్ హెడ్మాస్టర్, పంచాయతీ సెక్రెటరీ, ఆశా వర్కర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.