తెలంగాణ సెక్రటేరియట్‌కు ఏపీ ఉద్యోగులు..? రేవంత్ సర్కార్ కీలక ప్రకటన

byసూర్య | Tue, Jun 18, 2024, 08:13 PM

తెలంగాణ సచివాలయంలో సెక్షన్ ఆపీసర్లుగా ఏపీ ఉద్యోగులు రాబోతున్నారనే ప్రచారం గత రెండ్రోజులుగా జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ఉద్యోగులను తీసుకువస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ స్థానికత ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో తెలంగాణకు మరో 1800 ఉద్యోగులు వస్తున్నట్లు వార్తలు వినిపించాయి. సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లుగా 40 మంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా 20 మంది నియామకం ఉంటుందని.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ముందు చీఫ్ సెక్రటరీ ఫైల్ ఉంచారని ఆరోపించారు. సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగుల పెత్తనం చెలాయించడానికే ఇలా నియమిస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు సైతం మండిపడ్డారు.


అయితే ఈ వార్తలపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగులు తెలంగాణ సెక్రటేరియట్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రేవంత్ సర్కార్ వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నమ్మవద్దని సూచించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండేళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందన్నారు. ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలేమీ తీసుకోలేదన్నారు. తప్పుడు ప్రచారంపై సీఎంవో కార్యాలయం సోమవారం (జూన్ 17) ఆరా తీయగా.. ఆందోళనకు గురవుతున్న ఉద్యోగ సంఘాలను సర్కారు అప్రమత్తం చేసింది.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ జూన్‌ 2, 2024 నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఆఫీసులు, బిల్డింగ్‌లతో పాటు విభాగాల వారీగా విభజన చట్టంలోని అంశాలు, పరిష్కారంకాని సమస్యలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఉద్యోగుల పరస్పరం మార్పిడిపైనా అధికారులు సమాచారం సేకరించారు. ఈ విషయం బయటకు పొక్కటంతో ఏపీలో ఉన్న ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా అలాంటి ప్రయత్నాలు ఏమీ లేవని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM