చల్లగా బీరేస్తూ పని కానిచ్చేస్తున్న ఆర్టీవో ఉద్యోగి.. ఫొటో వైరల్.

byసూర్య | Tue, Jun 18, 2024, 07:53 PM

ప్రభుత్వ కార్యాలయాలంటే నిత్యం రద్దీగా ఉంటాయి. అందులోనూ రవాణా శాఖ కార్యాలయాలంటే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పొద్దుపొడవగానే.. జనాలు వాహనాలు పట్టుకుని వస్తూనే ఉంటారు. దీంతో.. అధికారులు బిజీ బిజీగా గడుపుతుంటారు. పని భారం ఎక్కువైతే.. మధ్యలో రిలాక్స్ అయ్యేందుకు టీ, కాఫీలో లేదా వేడెక్కిన బుర్రను చల్లబర్చుకునేందుకు కూల్ డ్రింకో తాగేందుకు అలా బయటికి వస్తుంటారు. లేదా కూర్చున్న దగ్గరికే తెప్పించుకుంటారు. కానీ.. ఇక్కడో అధికారి మాత్రం టీ, కాఫీ, కూల్ డ్రింకులకు బదులుగా ఏకంగా చిల్డ్ బీర్ తెప్పించుకున్నాడు. ఎంచక్కా కూర్చున్న చోటే సిప్పేస్తూ డ్యూటీ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.


మహబూబాబాద్ రవాణా కార్యాలయంలో ఈ సన్నివేశం కనిపించింది. ఆఫీసులో జనాలు లేరో.. చేసేందుకు పనే లేదో కానీ.. డ్యూటీలో ఉండగానే దర్జాగా ఆఫీసులో కూర్చొని.. టేబుల్ మీద బీర్ బాటిల్ పెట్టుకుని కనిపించాడు. ఆ అధికారి వ్యవహారాన్ని అక్కడే ఉన్న వాళ్లు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా... ఈ విషయం బయటికి వచ్చింది. మందు తాగి వాహనాలు నడుపొద్దని జనాలకు చెప్పాల్సిన రవాణా శాఖ అధికారి.. ఆఫీసులోనే బీరేస్తూ డ్యూటీ చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒకవేళ ప్రత్యేక సందర్భమేదైనా ఉందనుకున్నా.. కూల్ డ్రింక్స్‌, స్వీట్స్, ఇంకా అంటే బిర్యానీలో తెప్పించుకుంటారు కానీ.. ఏకంగా బీర్లు తెప్పించుకుని తాగటమనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


అయితే.. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆఫీసులో ఇదేం పని అని కొందరు మండిపడుతుంటే.. ఏం సుఖం వచ్చింది సారూ.. ఏం డెడికేషన్ గురూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి సదరు అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రాంతీయ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల తీరు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏం చేసినా చెల్లుతుందన్నట్టుగా కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM