తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిలాల్లో వర్షాలకు ఛాన్స్

byసూర్య | Sun, Jun 16, 2024, 07:24 PM

తెలంగాణలో నైరుతి రుతుపవాలు విస్తరించినా ఆశించినంతగా వర్షాలు మాత్రం కురవటం లేదు. వర్షం కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల విత్తనాలు విత్తిన రైతులు వరుణ రాక కోసం తపస్సు చేస్తున్నారు. మే నెలలో చెదురుమెుదరు వర్షాలు కురవగా.. జూన్ మెుదటి వారంలో కొన్ని వర్షాలు కురిశాయి. ఆ తర్వాత వరుణుడి జాడ లేకుండా పోయింది.


ఈ నేపథ్యంలో వాతావరణశాఖ వర్షాలపై కీలక అప్టేట్ ఇచ్చింది. బ్రేక్ రుతు పవనాలు ఈరోజు కూడా కొనసాగుతాయని చెప్పింది. అయితే కొన్ని ప్రదేశాల్లో మాత్రం వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో చెదురుమదురుగా వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేవని చెప్పారు. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుందని.. జూన్ 17 తర్వాతే తెలంగాణలో పూర్తిస్థాయిలో వర్షాలు కురుస్తాయన్నారు.


ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గానే కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ తీరం నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని.. అవి ఏపీ, తెలంగాణలోకి వస్తున్నాయన్నారు. బంగాళాఖాతం నుంచి రాయలసీమ వరకూ ద్రోణి కొనసాగుతోందని.. ఫలితంగా వచ్చే ఐదు రోజులపాటూ.. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు.


Latest News
 

తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 02:49 PM
సమగ్ర అభివృద్ధికై ప్రభుత్వాలు కృషి చేయాలి Sat, Oct 26, 2024, 02:24 PM
గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు Sat, Oct 26, 2024, 01:51 PM
బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన Sat, Oct 26, 2024, 01:02 PM
పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM