శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

byసూర్య | Sun, Jun 16, 2024, 04:33 PM

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని ఆయన్ను అరెస్టు చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకొని మియాపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అల్లర్లలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు.


అసలు వివాదం ఏంటంటే..


బక్రీద్ సందర్భంగా ఆవులను తరలిస్తున్న వాహనాలను మెదక్ పట్టణంలో అడ్డుకున్నారు. దీంతో పట్టణంలో అల్లర్లు చెలరేగాయి. ఇందులో ఓ వర్గానికి చెందిన వారు బీజేవైఎం, హిందూ సంఘాల నేతలపై కత్తితో దాడి చేశారు. ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆగ్రహించిన నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి అల్లర్లను సద్దుమణిగేలా చేశారు.


కాగా ఈ ఘటనపై రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రంతో గోవధ నిషేధం కొనసాగుతున్నప్పటికీ అక్రమంగా గోవులను తరలించే వారికి అడ్డుకుంటే దాడులు చేస్తార? ఆయన ఫైర్ అయ్యారు. శనివారం ఢిల్లీలో ఉన్న రాజాసింగ్.. ఆదివారం మెదక్ పట్టణానికి వస్తానని చెప్పారు. అల్లరి మూకల దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి తాను వస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాజాసింగ్ అక్కడకు వెళితే అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆయన్ను ముందస్తుగా ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM