నెల రోజుల పాటు ఆ రూట్లలో రైళ్ల సేవలు బంద్‌

byసూర్య | Sun, Jun 16, 2024, 04:38 PM

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. పలు మార్గాల్లో నెల రోజుల పాటు రైల్వే సేవలను రద్దు చేస్తు్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా.. కాజీపేట- సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం మీదుగా నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఈ రైల్వే సేవలు నిన్నటి (శనివారం) నుంచే నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే... మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.


సాంకేతిక సమస్యలకు సంబంధించిన వివరాలు ప్రకటించనప్పటికీ.. ఆయా మార్గాల్లో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. బాలాసోర్ వద్ద కోరమాండల్ విపత్తును దృష్టిలో ఉంచుకుని.. అధికారులు దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. ఈ ఆధునీకీకరణ నేపథ్యంలోనే.. పలు మార్గాల్లో నెల రోజుల పాటు ఈ రైల్వే సేవలను రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే.. రద్దయిన రైల్వే సేవల వివరాలు ఇలా ఉన్నాయి..


కాజీపేట- కాగజ్‌నగర్ (17003) రైలు ఈ నెల 17 నుంచి జూలై 6 వరకు రద్దు


కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ (2757/58) ఈ నెల 23 నుంచి జులై 6 వరకు రెండు వైపులా రద్దు


చెన్నై- జైపూర్ ఎక్స్‌ప్రెస్ (12967) ఈ నెల 23, 25, 30, జూలై 2,7 తేదీల్లో రద్దు


జైపూర్- చెన్నై ఎక్స్‌ప్రెస్ (12968) ఈ నెల 21, 23, 28, 30, జూలై 5న రద్దు


మైసూర్- జైపూర్ సూపర్ ఫాస్ట్ (12975) ఈ నెల 27, 29, జూలై 4, 6 తేదీల్లో రద్దు


యశ్వంత్‌పూర్- లక్నో (12539) ఈ నెల 26, జూలై 3న రద్దు


లక్నో- యశ్వంత్‌పూర్ (12540) ఈ నెల 28, జూలై 5 తేదీల్లో రద్దు


భాగమతి- మైసూర్ సూపర్ ఫాస్ట్ (12577) ఈ నెల 28న, జూలై 5న రద్దు


బిలాస్‌పూర్- త్రివేండ్రం తిరునవెల్లి ఎక్స్‌ప్రెస్ (22619) ఈ నెల 25, జూలై 2 రద్దు


త్రివేండ్రం- బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (22620) ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు


పాటలీపుత్ర- శ్రీమాతా వైష్ణో (22352) ఈ నెల 21, 28, జూలై 5వ తేదీల్లో రద్దు


శ్రీమాత వైష్ణో- పాటలీపుత్ర (22352) ఈ నెల 24, జూలై 1, 8 తేదీల్లో రద్దు


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM