తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

byసూర్య | Sat, Jun 15, 2024, 08:09 PM

తెలంగాణ రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగియటంతో పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ముందుగా అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


రాష్ట్రంలో ఆరు నెలల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడగా.. ఆ తర్వాత కొద్దిరోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని బదిలీ చేసింది. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలకు బ్రేక్ పడింది. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున మార్పులు చేసింది. ప్రస్తుతానికి 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా నియమించారు.


బదిలీ అయిన కలెక్టర్లు


కరీంనగర్‌- అనురాగ్‌ జయంతి


పెద్దపల్లి- కోయ శ్రీహర్ష


జగిత్యాల- సత్యప్రసాద్‌


ఖమ్మం- ముజామిల్‌ ఖాన్‌


నాగర్‌కర్నూల్‌- సంతోష్‌


భూపాలపల్లి- రాహుల్‌శర్మ


మంచిర్యాల- కుమార్‌ దీపక్‌


హనుమకొండ- ప్రావీణ్య


నారాయణపేట్‌- సిక్తా పట్నాయక్‌


మహబూబ్‌నగర్‌:- విజయేంద్ర


సిరిసిల్ల- సందీప్‌కుమార్‌ ఝా


భద్రాద్రి కొత్తగూడెం- జితేష్‌ వి పాటిల్‌


నల్గొండ- నారాయణరెడ్డి


వనపర్తి- ఆదర్శ్‌ సురభి


సూర్యాపేట కలెక్టర్‌- తేజస్‌ నందలాల్‌ పవార్‌


వికారాబాద్‌- ప్రతీక్‌ జైన్‌


కామారెడ్డి- ఆశిష్‌ సంగ్వాన్‌


ములుగు- దివాకరా


నిర్మల్‌- అభిలాష అభినవ్‌


వరంగల్‌- సత్య శారదాదేవి


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM