హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా డీలక్స్‌ బస్సులు, లగ్జరీ ప్రయాణం

byసూర్య | Sat, May 25, 2024, 08:38 PM

మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఫ్రీ బస్సులను ఉపయోగించుకుంటున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. టికెట్ కొనుక్కొని ప్రయాణించేవారికి సీటు కూడా దొరకటం లేదు. హైదరాబాద్‌లో అయితే.. చాలా దూరం వరకు నిల్చొనే ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.


ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్‌లో కొత్త బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ ఎసీ ఎలక్ట్రిక్ బస్సులు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు జులై చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందు కోసం ప్రత్యేకంగా 125 డీలక్స్ బస్సులను నడపాలని డిసైడ్ అయింది. ఈ బస్సులు కూడా జులైలోనే ప్రయాణికులకు అందుబాటులో రానున్నాయి.


హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన రూట్లలో ఈ డీలక్స్‌ బస్సులు నడపనున్నారు. ప్రస్తుతం సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. అయితే సౌకర్యవంతంగా వెళ్లాలనుకునే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని కొత్త డీలక్స్ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారందరూ టిక్కెట్‌ తీసుకోవాల్సిందేనని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM