న్యాయం చేయాలంటూ ఎస్‌ఐ భార్య ఆందోళన

byసూర్య | Wed, May 22, 2024, 04:56 PM

బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఓ ఎస్‌ఐ తన భార్యకు అన్యాయం చేశాడు. ఆమెకు తెలియకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు. గత రెండేళ్లుగా నరకం చూపిస్తూ.. విడాకులు ఇవ్వాలని టార్చర్ పెడుతున్నాడు. దీంతో విసిగిపోయిన మెుదటి భార్య న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.


బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజుతో మానసకు వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే గత ఏడాదిగా భార్య మానసను ఇద్దరు పిల్లలను కరీంనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంచాడు. ఆ తర్వాత అడపాదడపా కరీంనగర్ వస్తూ.. కొమురవెల్లిలోనే నాగరాజు ఎక్కవగా ఉంటున్నాడు. గత రెండు నెలలుగా భార్య మానసను నాగరాజు టార్చర్ పెట్టడం మెుదలుపెట్టాడు. తనకు విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.


ఏడాది క్రితం మరో అమ్మాయిని నాగరాజు రెండో పెళ్లి చేసుకున్నట్లు బాధితురాలు మానస వెల్లడించారు. అందుకే విడాకులు ఇవ్వాలని తనను టార్చర్ పెడుతున్నట్లు చెప్పారు. తన పిల్లలను కూడా దూరం చేసి తన వద్దే ఉంచుకుంటున్నాడని.. వారిని కూడా కలవనీయటం లేదని వాపోయారు. నాగరాజు కుటుంబ సభ్యుల ప్రమేయంతోని రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. తాను న్యాయం చేయాలని కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లగా.. ఎస్ఐ సెలవులో ఉన్నాడని సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. జిల్లా పోలీసు అధికారులను సంప్రదించినా తనకు న్యాయం జరగటం లేదని వాపోయారు. ఇప్పటికైనా తమ పిల్లలను తనకు అప్పగించి న్యాయం చేయాలని బాధితురాలు మానస పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM