అందంగా ఉండటమే ఆమెకు శాపమైంది

byసూర్య | Tue, May 21, 2024, 07:57 PM

అందంగా ఉండటమే ఆమెకు శాపమైంది. పెళ్లి చేసుకునేటప్పుడు ఏరికోరి మరీ చేసుకున్న భర్తే ఆమె జీవితానికి కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకుని.. జీవింతాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమెను కడతేర్చాడు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ ఉప్పల్‌లోని బ్యాంక్ కాలనీలో జరిగింది. జనగామ జిల్లాకు చెందిన రమేశ్, కమల(29) దంపతులు.. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కి వచ్చారు. ఉప్పల్‌లోని బ్యాంక్ కాలనీలో నివాసముంటున్నారు. ఏరికోరి చేసుకున్న అందమైన భార్యతో రమేశ్ చాలా కాలం పాటు ఎంతో ప్రేమగా ఉండేవాడు. దీంతో.. వాళ్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది.


హాయిగా సాగిపోతున్న వీళ్ల దాంపత్యంలోకి అనుమానం అనే పెనుభూతం ఎంటరైంది. ఇక అప్పటి నుంచి వాళ్ల జీవితం మొత్తం రివర్స్ అయ్యింది. భార్య అందంగా ఉండటం.. ఉద్యోగ రిత్యా రమేశ్ ఆఫీసులో ఎక్కువ సమయం ఉండాల్సి రావటంతో.. తన భార్య వేరే వాళ్లతో వివాహేత సంబంధం పెట్టుకుందోమోనన్న అనుమానం పెంచుకున్నాడు. అది కాస్త రోజు రోజుకు పెరిగిపోయి.. తరచూ భార్యతో గొడవపడేవాడని స్థానికులు చెప్తున్నారు.


ఇదే క్రమంలో.. సోమవారం రోజు కూడా ఇద్దరి మధ్య ఇదే విషయంలో గొడవ జరిగింది. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి లోనైన రమేష్ అర్ధరాత్రి సమయంలో కమలను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం.. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కమల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన చూసిన తర్వాత.. అందంగా ఉండటమే ఆమెకు శాపంగా మారిందని.. ఇలా చాలా మంది భార్యలపై అనుమానాలు పెంచుకుని సంతోషంగా సాగిపోయే సంసారాలను సర్వనాశనం చేసుకుంటున్నారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.


Latest News
 

మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే Fri, Oct 04, 2024, 02:32 PM
ఫ్యామిలీ హెల్త్ కార్డుల్లో వివరాలు పక్కాగా నమోదు చేయాలి Fri, Oct 04, 2024, 02:17 PM
మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ Fri, Oct 04, 2024, 02:14 PM
గొలుసు కట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం మోసం చేస్తే చర్యలు Fri, Oct 04, 2024, 02:00 PM
నవరాత్రుల పూజలో సతీసమేతంగా పాల్గొన్న నీలం మధు Fri, Oct 04, 2024, 01:45 PM