byసూర్య | Mon, May 20, 2024, 08:43 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ.. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఓవర్ స్పీడ్, రాంగ్‌రూట్లలో వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా.. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ కంటెనర్ లారీ మందున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది.
మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ వద్ద ఈ ఘటన జరిగింది. రహదారిపై జంక్షన్ వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు గాను స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వాటిని గమనించిన టాటా ఏస్ డైవర్ వాహనాన్ని స్లో చేశాడు. అయితే ఆ వెనకాలే వస్తున్న కంటైనర్ లారీ.. స్పీడ్ బ్రేకర్లను గమనించకుండా అదే స్పీడ్‌తో దూసుకెళ్లింది. ముందున్న టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనతో టాటా ఏస్ వాహనం దాదాపు 10 మీటర్లు ముందుకు వెళ్లి కిందపడిపోయింది. వాహనంలో కూర్చున్న వారు చెల్లాచెదురుగా పడిపోయారు. మెుత్తం 8 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ప్రమాద దృశ్యాలు ఉన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.