ప్రియురాలు వేరే వ్యక్తితో మాట్లాడుతుందని తెలిసి.. వీడియో కాల్‌లోనే ఆ పని చేసిన టెకీ

byసూర్య | Wed, May 08, 2024, 08:51 PM

ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ.. తానే తన జీవితమని భావిస్తున్న వ్యక్తి.. తన ప్రేయసి తనతో కాకుండా మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని.. ఆ కారణంగానే తనను దూరం పెడుతుందని తెలిస్తే.. ఆ ప్రియుడి పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్లు ఏమేం చేస్తారనేది చాలా సినిమాల్లో రకరకాలుగా చూపించారు. అయితే.. అచ్చం అలాంటి పరిస్థితే ఎదురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయికి వీడియో కాల్ చేసి.. ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు అర్పించుకున్నాడు. ఈ విషాదకర ఘటన.. హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ పరమరెడ్డి హిల్స్‌లో జరిగింది.


ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల ఇమ్రోస్ పటేల్.. అత్తాపూర్‌‌కు చెందిన సహోద్యోగి అయిన అమ్మాయితో ప్రేమలో పడ్డారు. చాలా రోజులు ఇద్దరూ చనువుగా ఉన్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. ఇంతలో ఏమైందో తెలియదు.. ఆ అమ్మాయి ఇంకో వ్యక్తితో మాట్లాడుతుందని, అతనితో చనువుగా ఉంటూ తనను దూరం పెడుతుందని తెలుసుకుని ఇమ్రోస్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ విషయంలోనే ఇద్దరికీ చాలాసార్లు గొడవలయ్యాయి.


కాగా.. తనే జీవితం అనుకున్న అమ్మాయి తనతో కాకుండా మరో వ్యక్తితో చనువుగా ఉండటం సహించలేని ఆ ఇమ్రోస్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తాను లేకపోతే ఉండలేనని ఆ అమ్మాయికి నిరూపించాలనుకున్నాడో.. బాధను తట్టుకోలేకపోయాడో.. ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. ఆమెతో మాట్లాడుతున్న సమయంలోనే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఇమ్రోస్ ఆత్మహత్య చేసుకున్నాడు.


ఆ అమ్మాయి.. వెంటనే ఈ విషయాన్ని ఇమ్రోస్ పటేల్ స్నేహితునికి ఫోన్ చేసి తెలిపింది. విషయం తెలుసుకున్న యువకుడి స్నేహితుడు పది నిమిషాల్లో ఇంటికి చేరుకొని చూడగా.. అప్పటికే ఫ్యాన్‌కు విగతజీవిలా వేలాడుతున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


అయితే.. గతంలో కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని.. అప్పుడు కూడా రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడని ఇమ్రోస్ స్నేహితులు వివరించారు. ఆ అమ్మాయి వల్లే ఇమ్రోస్ ఆత్మహత్య చేసుకున్నాడని సహోద్యోగులు కూడా చెప్పినట్టు సమచారం. అన్ని వివరాలు సేకరించి.. పోలీసులు విచారణ చేపట్టారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM