ఆర్టికల్ 370 రద్దు చేస్తాం : కిషన్ రెడ్డి

byసూర్య | Tue, May 07, 2024, 01:45 PM

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, స్వాత్యంత్రం వచ్చాక 2014 వరకు అనేక ఉగ్ర దాడులు జరిగాయి. జమ్మూ కాశ్మీర్ లో 42 వేల మంది పాకిస్థాన్ కారణంగా చనిపోయారు. హైదరాబాద్ తో సహా అన్ని ప్రాంతాల్లో ఐఎస్ఐ కి నెట్వర్క్ ఉండేది. మోడీ వచ్చాక దేశంలో ఐఎస్ఐ లేకుండా చేశామని, ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నామని మోడీ, అమిత్ షా, కొందరు అధికారులకు నాకు మాత్రమే తెలుసని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో మొన్నటి వరకు జిన్నా రాజ్యాంగం ఉండేది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో భారత రాజ్యాంగాన్ని అమలు చేసి హక్కులను కాపాడుతున్నాం. ఒక్క రక్తపు బొట్టు చిందకుండా ఆర్టికల్ 370 ని రద్దు చేశామని, ముప్పై మూడేళ్ల తరువాత జమ్మూ కాశ్మీర్ లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించమని తెలిపారు. 13న ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నకు దమ్ముంటే నాతో చర్చకు రావాలి: అశోక్ Sun, May 19, 2024, 07:06 PM
కేతేపల్లి మండల బిజెపి కోశాధికారిగా ఉపేంద్ర చారి Sun, May 19, 2024, 07:04 PM
మున్సిపల్ కార్మికురాలికి బీజేపీ నేత సంజయ్ దాస్ ఆర్థిక సాయం Sun, May 19, 2024, 07:02 PM
సాగర్ ప్రాజెక్టు సమాచారం Sun, May 19, 2024, 06:59 PM
అక్రమంగా తరలిస్తున్న గోవులు స్వాధీనం Sun, May 19, 2024, 06:20 PM