రైతుల ఖాతాల్లోకి డబ్బులు, సీఎం రేవంత్ కీలక ప్రకటన

byసూర్య | Sat, May 04, 2024, 07:20 PM

పెట్టుబడి సాయం కింద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రైతుబంధు పథకం కింద చాలా మందికి డబ్బులు జమ కాలేదు. 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు ఈ డబ్బులన జమ చేయగా.. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు డబ్బులు జమ చేయలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ చెప్పారు. నాలుగు లక్షల మంది రైతులకు రైతు బంధు ఇవ్వాల్సి ఉందని.. ఈ నెల 9 వరకు మిగిలిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎవరికైనా బకాయి ఉందని నిరూపిస్తే.. అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని అన్నారు.


ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్.. బకాయి ఉందని నిరూపించకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. భద్రాచలం రాములవారి సాక్షిగా తెలంగాణ రైతులకు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తానని చెప్పారు. తెలంగాణ రైతులకు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని అన్నారు. తెలంగాణలో గూడు పుఠాణి జరుగుతోందని... బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పదేళ్లలో ప్రధాని మోదీ తీసుకువచ్చిన అనేక చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇచ్చాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాలను పొందిపర్చిందని.. మోదీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు హామీలు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీ నేతలకు ఓట్లు అడగడానికి సిగ్గులేదా అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని మరోసారి అన్నారు.


అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి కుశ్వంత్ కుమార్ అంటున్నాడని..ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి.. అరగుండునా, గుండునా ? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని. కాంగ్రెస్‌ని గెలిపిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని రేవంత్ సూచించారు. ఖమ్మం అభ్యర్థి రఘరామిరెడ్డిని, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్‌ను మూడు లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. రైతు బంధు నిదులు ఎలా విడుదల చేస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


Latest News
 

భారీ వర్షానికి తడిసిన ధాన్యం Sat, May 18, 2024, 05:25 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్ Sat, May 18, 2024, 05:23 PM
రామకృష్ణను పరామర్శించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి Sat, May 18, 2024, 05:21 PM
పిట్లంలో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి వేడుకలు Sat, May 18, 2024, 05:20 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గన అవిశ్వాసం Sat, May 18, 2024, 05:18 PM