పాలిటిక్స్‌లోసీఎం రేవంత్‌ నాకంటే ప్రొఫెషనల్‌..బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

byసూర్య | Sat, May 04, 2024, 07:25 PM

తెంలగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యుర్థులపై మాటల తాటాలు పేల్చుతున్నారు. వారి వైఫల్యాలను ఎండగడుతూ మాటాల దాడికి దిగుతున్నారు. ఇటీవల చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. అసలు కొండా ప్రజా జీవితానికి పనికిరారని అన్నారు. ఆయన ప్రతిదీ వ్యాపార దృక్పథంతో చూస్తారని.. చివరకు బీజేపీ కార్యకర్తలు ఇంటికి కలవటానికి వెళితే అపాయింట్‌మెంట్ ఉందా ? అని అడుగుతారని సెటైర్లు వేశారు.


కొండా విశ్వే్శ్వర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేస్తే.. కొండా మాత్రం భిన్నంగా స్పందించారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కొండా.. రేవంత్ రెడ్డిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ తాను మంచి మిత్రులమని.. అయితే దోస్తులు దోస్తులే.. పాలిటిక్స్ పాలిటిక్సే అని అన్నారు. రాజకీయాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి తనకంటే ఎక్కువ ప్రొఫెషనల్‌గా ఉంటాడని చెప్పుకొచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి మాత్రమే ఢీకొంటాడని నమ్మానట్లు చెప్పారు. ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని తాను హస్తం పార్టీలో ఉన్నప్పుడు కోరానన్నారు. అయితే సీనియర్లు తనను వ్యతిరేకించి.. కోపగించుకున్నారని తదనంతర పరిణామాలతో తాను హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరినట్లు చెప్పారు.


ఇక గత ప్రభుత్వ హయంలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేశారని కొండా వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన అప్పులను ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని వెల్లడించారు. మోదీ పెద్దన్న కాబట్టే రాష్ట్రానికి రూ.9 వేల కోట్లు ఇచ్చారని.. ఆ డబ్బుతోనే ప్రస్తుతం రాష్ట్రం నడుస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకోకుండా ఏఐసీసీ ఆరు గ్యారంటీలను రేవంత్‌ నెత్తిన పెట్టిందని.. ఇందులో రేవంత్‌ తప్పేం లేదని చెప్పారు. అవి ఇప్పుడు గుదిబండలా మారాయన్నారు. రూ.2 లక్షల రుణమాఫీకే రూ.30 వేల కోట్లు కావాలని.. ఇప్పుడు ప్రభుత్వం వద్ద రూ.3 వేల కోట్లు కూడా లేవని అన్నారు.


తెంగాణలో ఈసారి బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్నారు. 11-12 సీట్లు కచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ను ఓడించటం గతంలో అసాధ్యమని.. ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని మాధవీలత విజయం సాధిస్తారని జోశ్యం చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని కొండా వ్యాఖ్యానించారు.



Latest News
 

కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా.. Sat, May 18, 2024, 05:01 PM
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం Sat, May 18, 2024, 04:57 PM
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఆర్డీవో Sat, May 18, 2024, 04:54 PM
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి Sat, May 18, 2024, 04:52 PM
29న ఘంటసాల కాంస్య విగ్రహం ఆవిష్కరణ Sat, May 18, 2024, 04:46 PM