ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఇంకో షాక్.. మరో కీలక నేత కూడా రాజీనామా

byసూర్య | Sat, May 04, 2024, 07:16 PM

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అందులోనూ బీఆర్ఎస్ పార్టీలో సమీకరణాలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మొదలుపెడితే.. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనూ.. కీలక నేతలంతా పార్టీని విడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కారు దిగి.. కాంగ్రెస్, బీజేపీ కండువాలు కప్పుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ వరుసలో మరో కీలక నేత కూడా చేరారు.


మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పంపినట్లు రాపోలు ఆనంద్ భాస్కర్ తెలిపారు. ఏడాది క్రితం బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన రాపోలు మళ్లీ గులాబీ పార్టీకి రాజీనామా చేయటం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాపోలుతో పాటు.. మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు సమాచారం. మరి వీళ్లంతా ఏ పార్టీలో చేరతారన్నది తెలియాల్సి ఉంది.


అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు బలం తగ్గుతుంది. ఓటమి కారణంగా కీలక నేతలు పార్టీ మారుతున్నారు. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి.. కీలక నేతల రాజీనామాలతో మరో షాక్ తగిలినట్టయింది.


Latest News
 

జ్యోతి యాత్రలో పాల్గొన్న కొత్తకోట కాంగ్రెస్ నాయకులు Sat, May 18, 2024, 04:14 PM
ఉరేసుకుని ఆటో డ్రైవర్ మృతి Sat, May 18, 2024, 04:12 PM
స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచాలని వినతి Sat, May 18, 2024, 04:11 PM
జూరాలకు చేరిన కర్ణాటక నీళ్ళు Sat, May 18, 2024, 04:10 PM
బీఆర్ఎస్ పార్టీ బీమా చెక్ అందజేత..! Sat, May 18, 2024, 04:08 PM