మూతపడుతున్న ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు.. మందుల కొరతే కాదు, కిరాయిలు కూడా కట్టలేని దుస్థి

byసూర్య | Sun, Apr 28, 2024, 07:55 PM

తెలంగాణలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల పరిస్థితి రోజు రోజుకు మరీ అధ్వాన్నంగా మారుతోంది. ఈఎస్ఐ ఆస్పత్రులకు కార్మికులు రకరకాల ఆనారోగ్య సమస్యలతో పెద్ద ఎత్తున వస్తుండగా.. వైద్య సిబ్బంది సరిగ్గా లేకపోవటం, సదుపాయాలూ అంతంతమాత్రమే ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే.. రోజంతా లైన్లలో వేచి ఉండి.. ఇబ్బందులన్నింటికీ ఓర్చుకుని వైద్యులకు చూపించుకుంటే.. వాళ్లు రాసిన మందులు తీసుకునేందుకు డిస్పెన్సరీకి వెళ్తే.. రాసిన మందుల్లో ఒకటీ అర అక్కడ దొరికితే.. సగానికి ఎక్కువ బయటే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు ఏకంగా డిస్పెన్సరీలకే తాళాలు వేయటం గమనార్హం.


చిరుద్యోగులు, కార్మికులకు ఉచితంగా మందులు, వైద్య సేవలు అందించే డిస్పెన్సరీలు తాళాలతో దర్శనమిస్తున్నాయి. మందుల కొరతకు తోడు అద్దె బకాయిలు కూడా తోడవటంతో ఇప్పటికే కొన్ని డిస్పెన్సరీలు మూతపడగా.. త్వరలో మరికొన్ని కూడా మూత పడనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిస్పెన్సరీలు 2.10 కోట్ల రూపాయల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా.. కార్మికులు, చిరుద్యోగులు ఎవరైనా డిస్పెన్సరీల్లో ఉండే డ్యూటీ డాక్టర్ రాసిస్తేనే.. మెయిన్ ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. డైరెక్టుగా వెళ్తే పని కాదు. ఈ లిటికేషన్‌తో.. వైద్య సేవలు అందక కార్మికులు అల్లాడుతున్నారు.


అయితే.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 డిస్పెన్సరీలకు తాళాలు పడినట్టు తెలుస్తోంది. ముందు ముందు మిగతా డిస్పెన్సరీలు కూడా మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అద్దె చెల్లించకపోవడం వల్లే ఎక్కడికక్కడ తాళాలు వేస్తున్నారు భవన యజమానులు. ఈ క్రమంలోనే జహీరాబాద్‌, తూప్రాన్‌, నల్గొండతో పాటు 9 డిస్పెన్సరీలకు తాళాలు వేశారు యజమానులు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల రూపాయలకు పైగా అద్దె బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది.


రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో 1,55,525 ఈఎస్‌ఐ కార్డు దారులు ఉండగా.. 17 డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటిలో రోజుకు ఒక్కో డిస్పెన్సరీకి 200 మందికి పైగా కార్మికులు చికిత్సకు వస్తుంటారు. అనారోగ్య సమస్యలతో ఇక్కడికొచ్చే కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇస్తుంటారు. స్థానికంగా చికిత్స అందని రోగులను వరంగల్, హైదరాబాద్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తారు. స్థానిక డిస్పెన్సరీలతో పాటు వరంగల్, హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో సైతం పూర్తి స్థాయి వైద్య పరీక్షలు, చికిత్సలు, మందులు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది


అద్దె బకాయిలతో మూతపడుతున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలు


రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పనిచేసే నెల ఆదాయం రూ.21వేల లోపు ఉన్న కార్మికులంతా ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తారు. కార్మికుడికి చెల్లించే జీతం నుంచి 0.75 శాతం కార్మికుడి వాటాగా చెల్లించాలి. పనిచేసే కంపెనీ యాజమాన్యం వారు 3.25 శాతం ఈఎస్‌ఐకి చెల్లిస్తుంది. కార్మికులకు వైద్య సేవల కోసం రాష్ట్రవ్యాప్తంగా 71 ఈఎస్ఐ డిస్పెన్సరీలుండగా వాటిలో 57 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. డిస్పెన్సరీలకు అద్దె చెల్లించక పోవడంతో ఇప్పటికే 9 డిస్పెన్సరీ కేంద్రాలకు తాళాలు పడ్డాయి. త్వరలోనే మరికొన్ని మూతపడే పరిస్థితి వచ్చింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలకు అద్దెలు సకాలంలో చెల్లించడం లేదు. కొన్నింటికి రెండేళ్లుగా, మరి కొన్నింటికి ఏడాదిగా, నెలలుగా అద్దెలు పెండింగ్‌లో ఉండటంతో యజమానులు ఏం చేయలేక డైరెక్టుగా తాళాలు వేస్తున్నారు.


ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని తార్నాక, మేడ్చల్, శామీర్‌పేట, బొల్లారం, ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, బీబీనగర్ డిస్పెన్సరీలకు తాళాలు వేశారు. ప్రస్తుతం 57 డిస్పెన్సరీలకు సంబంధించిన అద్దెలు సుమారు రూ.2.10 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో రూ.1.25 కోట్లకు సంబంధించి బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. మిర్యాలగూడలోని ఈఎస్ఐ డిస్పెన్సరీకి రెండేళ్లకు పైగా పెద్దబకాయలు ఉన్నాయని, దీంతో డిస్పెన్సరీకి తాళం వేశానని భవన యజమాని చెబుతున్నారు. అద్దె బకాయలు చెల్లించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని భవన యజమానులు చెబుతున్నారు.


Latest News
 

25 రోజుల్లో 10 వేల కేసులు నమోదు.. 320 కోట్ల సొత్తు స్వాధీనం Sun, May 12, 2024, 07:34 PM
తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఈ 10 రోజులు నో టెన్షన్ Sun, May 12, 2024, 07:31 PM
ఓటర్ల వేలికి పడే 'సిరా చుక్క' తయారయ్యేది హైదరాబాద్‌లోనే.. 37 ఏళ్లుగా తయారీ, 100 దేశాలకు ఎగుమతి..! Sun, May 12, 2024, 07:27 PM
తెలంగాణ ఎన్నికలు.. ఇప్పటి వరకు సీజ్ చేసిన సొత్తు విలువ ఎన్ని కోట్లో తెలుసా Sun, May 12, 2024, 07:23 PM
ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. డిక్కీలో కనిపించిన 2 బ్యాగులు.. ఏంటని తెరిచి చూస్తే మైండ్ బ్లాక్..! Sun, May 12, 2024, 06:16 PM