అసలు మాకు ఆ ఆలోచనే లేదు.. వాళ్లిద్దరి మధ్యే ఏదో ఉంది: కేటీఆర్

byసూర్య | Sun, Apr 28, 2024, 07:42 PM

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో అసక్తికర పరిణామాలు ఏర్పడుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో.. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని.. ఎక్కువ రోజులు సర్కార్ నిలబడదంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే వ్యాఖ్యానించటమే కాదు.. ఏకంగా గులాబీ బాస్ కేసీఆరే ఆ మాట అనటం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది.


దీంతో.. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. ఈ క్రమంలోనే.. కాంగ్రెస్ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వేములవాడలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనే లేదన్నారు కేటీఆర్. అయితే.. ఆ ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు.


కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే రహస్య ఒప్పందం నడుస్తోందని కేటీఆర్ కీలక ఆరోపణ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‍‌లో భాగంగానే పలు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలిచే విధంగా డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందంటూ ఆరోపించారు. పార్టీ కండువా లేకుంటే.. ఆ పార్టీ కార్యకర్తలే తమ అభ్యర్థినే గుర్తించలేరంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యలోనే అన్నారు కేటీఆర్. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను 10 నుంచి 12 సీట్లలో గెలిపించినట్టయితే.. రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలోనే వస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.


Latest News
 

పోలింగ్ వేళ కార్మికులందరికీ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఉత్తర్వులు కూడా జారీ Mon, May 13, 2024, 07:33 PM
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ అలర్ట్.. టైమింగ్స్ మార్పు Mon, May 13, 2024, 07:27 PM
తెలంగాణలో ముగిసిన పోలింగ్.. నియోజకవర్గాలవారిగా ఓటింగ్ శాతం ఇదే Mon, May 13, 2024, 07:23 PM
మందుబాబులకు మరో షాక్.. అప్పటి దాకా సుక్క దొరకదు, సీపీ కీలక ఆదేశాలు Mon, May 13, 2024, 06:08 PM
చల్లని రోజున చల్లని పని చేశా.. స్మితా సబర్వాల్ కూల్ ట్వీట్.. నెటిజన్ల కామెంట్లు వేరే లెవల్ Mon, May 13, 2024, 06:04 PM