చిక్కుల్లో ఎమ్మెల్యే రాజాసింగ్.. తాజాగా మరో కేసు నమోదు

byసూర్య | Mon, Apr 22, 2024, 07:22 PM

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో వార్తల్లో నిలిచే హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా.. ఆయనపై మరో పోలీసు కేసు నమోదైంది. శ్రీరామ నవమి వేడుకల్లో ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు రాజా సింగ్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188, 290 రెడ్ విత్ 34 కింద ఆయనపై కేసు ఫైల్ చేశారు.


ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా రాజాసింగ్ ర్యాలీ నిర్వహించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరంలో శాంతిభద్రతల దృష్ట్యా రాజా సింగ్ ర్యాలీకి పోలీసులు ముందుగా అనుమతి నిరాకరించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పటికీ అభిమానులు, అనుచరులతో కలిసి రాజా సింగ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనపై సీరియస్ అయిన అప్జల్ గంజ్ పోలీసులు రాజా సింగ్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. తాజాగా.. సుల్తాన్ బజారు పోలీసులు కూడా ఆయనపై కేసు ఫైల్ చేశారు.


కాగా, రాజాసింగ్‌పై దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. ఇస్లాం మతంపై వివాదాస్పవ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో 2022లో ఆయన్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నేతల ఒత్తడి మేరకు గతేడాది సస్పెన్షన్ ఎత్తేసింది. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు.


Latest News
 

కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను మరణాల ఉచ్చుగా మార్చింది : కేటీఆర్ Fri, Sep 20, 2024, 12:34 PM
పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం : నీలం మధు Fri, Sep 20, 2024, 12:27 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. Fri, Sep 20, 2024, 12:25 PM
మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Fri, Sep 20, 2024, 12:12 PM
మందుల దుకాణాలు పై డీసీఏ అధికారులు దాడులు Fri, Sep 20, 2024, 12:07 PM