తీన్మార్ మల్లన్న గిదేందన్నా.. గరీబోళ్లు కదన్న.. బక్కా జడ్సన్ రిక్వెస్ట్

byసూర్య | Sat, Apr 20, 2024, 07:20 PM

తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన బక్కా జడ్సన్‌పై రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ పార్టీకి రెబల్ నాయకుడిగా మారిన బక్కా జడ్సన్.. ఇప్పుడు వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలోనే.. ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ నిరుద్యోగుల మద్దతు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. తనను ఓ క్యాటరింగ్ యజమాని కలిశారని.. అతనికి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ డబ్బులు బాకీ ఉన్నాడంటూ తెలిపినట్టు తెలిపారు. దీంతో.. అతనికివ్వాల్సిన డబ్బు ఇచ్చేయాలని మల్లన్నకు బక్కా జడ్సన్ రిక్వెస్ట్ చేస్తూ.. ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.


తాను.. ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో జడ్పీ స్కూల్ దగ్గర ఉన్న వాకర్స్ గ్రౌండ్ వెళ్లగా.. అక్కడ బోసు బాబు అనే క్యాటరింగ్ యజమాని కలిసినట్టు చెప్పుకొచ్చారు. అయితే.. గతంలో జరిగిన ఎన్నికలప్పుడు తీన్మార్ మల్లన్న మీటింగ్స్‌ కోసం క్యాటరింగ్ చేశానని.. కానీ దానికి మల్లన్న మాత్రం డబ్బులు ఇవ్వలేదంటూ చెప్పినట్టు వివరించారు. తనకు అక్షరాల 3 లక్షల 46 వేలు ఇవ్వాల్సి ఉందని.. ఎన్ని రకాలుగా అడిగిన ఇవ్వట్లేదని.. తనను ఒకసారి అడిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.


"తీన్మార్ మల్లన్న.. ఇది కరెక్ట్ కాదన్న.. ఇచ్చేది లేదని నువ్వు అంటే బోసు బాబు మళ్లీ అడగనని కూడా అంటున్నాడు. ఒక వేళ ఇచ్చేది ఉన్నట్టయితే.. ఇచ్చేయ్ అన్న. గరీబోళ్లు కదన్న.. ప్రజాజీవితంలో ఉన్నాం. పెద్దపెద్దోళ్లతో పెట్టుకున్నాం.. కానీ ఇలా చిన్న చిన్నోళ్లతో ఎందుకన్నా. మనం వాళ్ల బతుకును ఉద్దరిద్దామని రాజకీయాల్లోకి వచ్చినం కదన్నా. మనం రోజు ఎంతో మందికి చెప్తాం. కేసీఆర్, కవిత, కేటీఆర్ ఇలా ఇష్టమొచ్చినోళ్లను తిడుతుంటాం. మరి ఇలాంటోళ్లకు అన్యాయం జరిగితే ఎవరు అడుగుతారన్న. మల్లన్నా.. నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నా. గరీబోళ్లు కాబట్టి నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మళ్లీ మళ్లీ అడగను. తన భార్య పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చుకున్నాడటా.. ఆయనతోని ఉన్నోళ్లు కూడా అవిటోళ్లు. ఇలాంటోళ్లను మనం మోసం చేయటం కరెక్ట్ కాదన్న. నువ్వు ఇస్తవని నేను అనుకుంటున్న అన్న.." అంటూ బక్కా జడ్సన్ రిక్వెస్ట్ చేశారు.


అంతకు ముందు.. బోసు బాబు కూడా మాట్లాడుతూ.. తాను తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి మరీ.. సూపర్ మార్కెట్‌లో అప్పు తీర్చానని చెప్పుకొచ్చారు. తనకు డబ్బులు ఇవ్వాలని.. తీన్మార్ మల్లన్నతో ఉన్న వాళ్లకు తెలుసని వివరించారు. ఒకవేళ తనకు ఇచ్చేదేమీ లేదని చెప్తే.. మళ్లీ అడగనంటూ బోసు బాబు చెప్పుకొచ్చారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM