కవితకు మరో షాక్ - తీహార్ జైల్లో అరెస్ట్ చేసిన సీబీఐ

byసూర్య | Thu, Apr 11, 2024, 03:50 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు  మరో షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో ఇప్పటికే ఆమె తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.తాజాగా, కవితను గురువారం ఈ కేసులో సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. కాగా, లిక్కర్ కేసుకు సంబంధించి కవితను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 6న కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమెను ప్రశ్నించింది. ఇదే కేసులో గతంలో ఆమెను సీబీఐ ప్రశ్నించింది. తాజాగా, కవితను కస్టడీలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఆమె కుట్రలు పన్నారని సీబీఐ ఆరోపించింది. ఈ క్రమంలో కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు. మరోవైపు, కవిత రెగ్యులర్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ జరగనుండగా.. తాజాగా సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం సంచలనంగా మారింది.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM