byసూర్య | Mon, Apr 08, 2024, 03:22 PM
సిరిసిల్ల లోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులను క్షేత్రస్థాయిలో గుర్తించిన తరువాతే ముందుకు వెళ్లాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో భాగంగా చేపట్టాల్సిన మరమ్మత్తు పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో నీటి పారుదల, పంచాయతీ రాజ్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.