byసూర్య | Mon, Apr 08, 2024, 03:22 PM
కోయిలకొండ మండలం కొత్లాబాద్ గ్రామంలో సోమవారం మల్లిఖార్జున స్వామి బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు భక్తిశ్రద్దలతో స్వామి వారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సన్మానించి ఆశీర్వదించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.